Home

»

Latest News

jana nayagan: 'జన నాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్!.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కెనడా డిస్ట్రిబ్యూటర్ 

Jul 9, 2026 5:12PM

 

కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇళయ దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో 'జన నాయగన్'(jana nayagan)విడుదలపై ఎట్టకేలకు ఒక భారీ అప్‌డేట్ వచ్చేసింది. విజయ్ నుంచి వస్తున్న  ఆఖరి మూవీ కావడం, తమిళనాడు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఆరు నెలలుగా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులతో నలుగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా, ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా కెనడాకు చెందిన ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ 'యార్క్ సినిమాస్' (York Cinemas) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. తమ ఓన్ దళపతి విజయ్ థియేటర్లలో అగ్గి రాజేయడానికి సిద్ధంగా ఉన్నాడంటూ, కెనడాలో జూలై 24 నుండి 'జన నాయగన్' స్క్రీన్స్‌పై సందడి చేయనుంది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతాయి అంటు అధికారికంగా ట్వీట్ చేశాడు . ఈ ఒక్క అప్‌డేట్‌తో దళపతి అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి.

Also read: Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ సైలెన్స్ వెనుక అసలు కారణం ఇదేనా.. మెగా ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్!


విశ్వసనీయ సమాచారం ప్రకారం, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరికీ చిత్ర యూనిట్ ఇప్పటికే ముందస్తు సమాచారం ఇచ్చేసింది. ఒకవేళ అంతా అనుకూలిస్తే ఒక రోజు ముందుగానే, అంటే జూలై 23నే ప్రీమియర్స్ పడే అవకాశం కూడా ఉంది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మమితా బైజు, ప్రియమణి వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే జనగణమన నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com