.webp)
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి సర్వం సిద్ధం చేసుకుంది. జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైంను 2 గంటల 39 నిమిషాలకు లాక్ చేశారు.
థియేట్రికల్ రిలీజ్‌కు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి వచ్చిన సెన్సార్ రిపోర్ట్ అటు అక్కినేని అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. గత చిత్రం 'ఏజెంట్' ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో దాదాపు 3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తీసుకున్న అఖిల్‌కు ఈ సినిమా బాక్సాఫీస్ విజయం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
సెన్సార్ బోర్డు వర్గాల నుండి అందిన ఇన్సైడ్ టాక్ ప్రకారం.. 'లెనిన్' సినిమా స్క్రీన్‌ప్లే ఎక్కడ తడబాటు లేకుండా, చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుందని సమాచారం. ముఖ్యంగా సినిమా రన్‌టైమ్ క్రిస్ప్‌గా ఉండటం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది. అనవసరమైన సాగతీత సీన్లు లేకుండా కథను ఎంతో వేగంగా నడిపించారని తెలుస్తోంది. ఇక సినిమా ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎలివేషన్లతో సాగిపోతే, సెకండాఫ్ మాత్రం పూర్తి స్థాయిలో ఎమోషనల్ ఇంపాక్ట్‌తో సాగుతుందని సమాచారం. ద్వితీయార్థంలో వచ్చే బలమైన భావోద్వేగాలు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, ప్రతి ఒక్కరినీ ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
ఈ చిత్రంలో ప్రధాన నటీనటులైన అఖిల్ అక్కినేని, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే లీడ్ పెయిర్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీతో పాటు, కథలోని ఎమోషనల్ కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని సమాచారం. హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయని సెన్సార్ టాక్ ద్వారా స్పష్టమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ సరిగ్గా కుదరడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా ఓపెనింగ్స్, లాంగ్ రన్ కలెక్షన్లపై అత్యంత సానుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో నడుస్తున్న ఈ పాజిటివ్ బజ్ గనుక నిజమైతే, అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక భారీ కమర్షియల్ సక్సెస్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
Akhil Akkineni, Lenin Movie, Bhagyashri Borse, TeluguOne






