Home

»

Latest News

Pawan kalyan: రేపు ముంబైకి పవన్ కళ్యాణ్.. ఎన్నో రోజులు ఉంటారంటే!

Jul 9, 2026 3:15PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఇటీవల తన అప్ కమింగ్ మూవీ 'ఓజి 2' కి సంబంధించిన పనులని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కి సంబంధించిన ఒక కీలకమైన వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ చికిత్స నిమిత్తం రేపు ముంబై నగరానికి వెళ్తున్నారు. 

పవన్ రెండు భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు 'రొటేటర్ కఫ్' (Rotator Cuff) అనే నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి అయిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఇప్పటికే ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల అనంతరం ఆయన రెండు భుజాల కండరాలు చిట్లిపోయినట్లు మరియు గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు అక్కడి నిపుణులైన వైద్యులు నిర్ధారించారు. భుజాల కండరాల పరిస్థితి జఠిలంగా మారడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే  ప్రత్యేక వైద్య చికిత్స తీసుకోవాలని వైద్య బృందం ఆయనకు గట్టిగా సూచించింది. చికిత్స పూర్తయిన తర్వాత కచ్చితంగా కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవడం అత్యంత అవసరమని కూడా డాక్టర్లు స్పష్టం చేశారు.

Peddi: ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది.. థియేటర్ వర్షన్‌కి, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కి తేడాలు ఇవే!


నిజానికి పవన్ కళ్యాణ్ గత ముంబై పర్యటనలోనే తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ఈ ఆసుపత్రిని సందర్శించి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు అప్పుడే సర్జరీకి సిఫార్సు చేసినప్పటికీ, అప్పటికే షెడ్యూల్ అయిన పలు అధికారిక, పాలనాపరమైన కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమీక్షలు ఉండడం వల్ల ఆయన కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకవైపు ప్రభుత్వ శాఖల సమీక్షలు, మరోవైపు ప్రజా పర్యటనలు, దీనికి తోడు పాత సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఒత్తిడి కారణంగా ఆయన తన ఆరోగ్యాన్ని కొంతవరకు నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. ఈ విపరీతమైన శారీరక శ్రమ మరియు ఒత్తిడి కారణంగానే రెండు భుజాల కండరాల గాయం మరింత తీవ్ర రూపం దాల్చింది. అయితే ఇప్పుడు ముందుగా నిర్ణయించుకున్న అత్యవసర పాలనాపరమైన బాధ్యతలను ఒక కొలిక్కి తెచ్చిన పవన్ కళ్యాణ్, చివరకు తన భుజాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముంబైలో చికిత్స పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ చికిత్స అనంతరం ఆయన కొద్దిరోజుల పాటు రాజకీయాలకు, పర్యటనలకు దూరంగా ఉండి పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోనున్నారు. జనసేనాని త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

pawan kalyan, og2, mumbai

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com