
-రేపు డెకాయిట్ తో థియేటర్స్ లోకి అడివి శేష్ రాక
-ప్యూర్ పాజిటీవ్ వైబ్రేషన్స్
-ఈ నేపథ్యంలో లేటెస్ట్ న్యూస్ వైరల్
డెకాయిట్ తో రేపు సిల్వర్ స్క్రీన్ పై మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)తో కలిసి ల్యాండ్ కానున్న నేపథ్యంలో అడివి శేష్(Adivi Sesh)చెప్పిన ఒకే ఒక్క మాట ఇప్పుడు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. సదరు న్యూస్ రేంజ్ ని పెంచే బాధ్యతని ప్రేక్షకులు ఎలా అయినా తీసుకుంటారు. కానీ పొలిటికల్ లీడర్స్ కూడా ఆ బాధ్యతలో కొంత భాగం షేర్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సదరు న్యూస్ లో దాగి ఉన్న సినిమా గొప్ప తనం. మరి అడివి శేష్ మాటలు ఏంటో చూద్దాం.
అడివి శేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు చందమామ మూవీలో మొదట హీరోని నేనే. కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నాను. కానీ కృష్ణవంశీ(Krishna vamsi)గారికి నా పెర్ఫార్మ్ నచ్చకపోవడంతో నన్ను తప్పించారని చెప్పుకొచ్చాడు. దీంతో సినీ మేధావులు రంగంలోకి దిగి ఇప్పుడు దిరికింది మాకు అసలైన పని అంటు అడివి శేష్ సినీ ట్రాక్ ని క్షుణంగా పరిలిస్తున్నారు. మనం కూడా ఒకసారి ఆ ట్రాక్ చూద్దాం.
Also read: Varanasi: వారణాసి కథ ఇదేనంట! ఇది ఆ కంపెనీ చేసిన పనేనా!
అడివి శేష్ 2010 లో కర్మ అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. నిర్మాత, దర్శకుడు కూడా తనే. కానీ 2002 లో శ్రీను వైట్ల 'సొంతం' మూవీలో చిన్న రోల్ లో కనిపించాడు. చందమామ 2007 లో వచ్చింది. అంటే ఒక వేళ చందమామలో తన పెర్ఫార్మ్ , కృష్ణవంశీ అనుకున్న హీరో క్యారక్టర్ తాలూకు స్వభావానికి దగ్గరగా ఉండి ఉంటే కర్మ వచ్చి ఉండేది కాదు. దానినే సినీ కర్మ అంటారు. ఇక చందమామ మూవీ విషయానికి వస్తే వాతావరణం చల్లగా ఉన్న వేళ పచ్చని పొలాల్లో తినే అచ్చ తెలుగు భోజనంలాగా ఉంటుంది. నవదీప్, కాజల్ అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేయగా కృష్ణవంశీ డైరెక్షన్ నభూతో నభవిష్యత్.
.webp)





