Home

»

Latest News

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి యుఎస్ రివ్యూ 

Apr 18, 2025 10:25AM

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi)తల్లి కొడుకులుగా నటించిన చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun son of vyjayanthi). యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కగా ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri)దర్శకత్వం వహించాడు. ఆల్రెడీ ప్రచార చిత్రాలు బాగుండటం,మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఒక లెవల్లో ఉంటుందని చెప్పడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ పై కళ్యాణ్ రామ్, అశోక్ వర్దన్, సునీల్ సంయుక్తంగా నిర్మించారు.ఈ రోజు థియేటర్స్ లోకి గ్రాండ్ గా అడుగుపెట్టిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'  యుఎస్ లో ఇప్పటికే కొన్ని ఏరియాల్లో షోస్ ని కంప్లీట్ చేసుకుంది.  

అక్కడి ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఫస్ట్ హాఫ్ ఒక కూంబింగ్ ఆపరేషన్ సీక్వెన్స్‌తో  ప్రారంభమయిందని, కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎంట్రీ సీన్స్ తో పాటు,తల్లి,కొడుకులుగా ఆ ఇద్దరి నటన సినిమాకి బాగా హెల్ప్ అయిందని చెప్తున్నారు. మెయిన్ కథలోకి వెళ్ళడానికి కొంచం టైం తీసుకున్నా సరే అలాంటి ఫీలింగ్ ని ప్రేక్షకుడికి కలగకుండా కళ్యాణ్ రామ్,విజయశాంతి తమ నటనతో కట్టిపడేసారని, పైగా ఆ ఇద్దరి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు కూడా మెప్పించే స్థాయిలో ఉన్నాయనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   ఇక సెకండ్ హాఫ్ లో కథ వేగం అందుకోవడంతో పాటు, యాక్షన్ సన్నివేశాలు ఒక స్థాయిలో ఉన్నాయని, సదరు సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్, విజయశాంతి పెర్ ఫార్మెన్సు పోటాపోటీగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. 

మిగతా నటీనటులు కూడా తమ క్యారక్టర్ ల పరిధి మేరకు బాగా నటించి మూవీకి హెల్ప్ అయ్యారని కూడా చెప్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ జోడి కట్తగా శ్రీకాంత్, సోహైల్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com