రెట్రో మూవీ రన్ టైం ఇంతే.. 8 సెన్సార్ కట్స్ చేసారు!
on Apr 17, 2025
సూర్య(Suriya)గత ఏడాది నవంబర్ లో 'కంగువా'(Kanuguva)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచి అభిమానులతో పాటు ప్రేక్షకులని నిరాశపరిచింది. దీంతో తన అప్ కమింగ్ మూవీ 'రెట్రో' పైనే అందరి ఆశలు ఉన్నాయి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న 'రెట్రో'(Retro)కి 'కార్తీక్ సుబ్బరాజ్'(Karthik SUbbaraj)దర్శకత్వం వహించాడు. మే 1 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
రీసెంట్ గా 'రెట్రో' రన్ టైం బయటికి వచ్చింది. మూవీ నిడివిని 168 నిమిషాలకి మేకర్స్ కట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 2 గంటల 48 నిమిషాలు మూవీ రన్ అవ్వనుంది. ఈ మధ్యన వస్తున్న చాలా సినిమాలు ఇంచుమించు ఇదే నిడివితో వస్తున్నాయి. పైగా నిడివితో సంబంధం లేకుండా బిగువైన కథనాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్నాయి. మేకర్స్ ఈ ధైర్యంతోనే రెట్రో రన్ టైం లో భయపడటం లేదన్నట్టుగా కోలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ లో మొత్తం 8 కట్స్ పడినట్టు తెలుస్తుంది.
సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుండగా జాజు జార్జ్, నాజర్, జయరాం, కరుణకర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించగా స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించాయి. 2 డి ఎంటర్ టైన్ మెంట్ సూర్య కి చెందిన నిర్మాణ సంస్థనే. త్వరలోనే ట్రైలర్ తో పాటు సాంగ్స్ రిలీజ్ కానున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
