ఆ రెండు చిత్రాలలో చిరుకి హ్యాండిచ్చిన నయన!
on Dec 23, 2022
.webp)
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే మనందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార. ప్రతి స్టార్ హీరోతో కలిసి నటించిన ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అయితే నయనతారాన్ని, వివాదాలను మనం విడివిడిగా చూడలేం. నయనతార అంటే వివాదం.....వివాదం అంటే నయనతార.....నయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్. కాంట్రవర్శీ లేనిదే బహుశా ఆకలి, నిద్ర పట్టవేమో...! పోనీ అల్లాటప్పా వాళ్లతో వివాదాలా? అంటే కాదని చెప్పాలి. హీరో చిరంజీవి అయినా, బాలయ్య, రజనీ, విజయ్.. ఇలా ఎవరితోనైనా ఫైట్‌కి రెడీ. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆమె సినిమాలకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనను... అని అగ్రిమెంట్ చేసుకుంటుంది. మరీ అత్యవసరమైతే అదనపు రెమ్యూనేషన్ను వసూలు చేసి తూతూ మంత్రంగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది అంటారు.
చివరికి రజిని అయినా ఒకటే చిరు అయిన ఒకటే. తాను ప్రమోషన్ లో పాల్గొనేది లేదు అనే నియమం మీద ఏ సినిమాకైనా సంతకం చేస్తుంది.. కానీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల ప్రమోషన్స్ లో పాల్గొంటాను అని సంతకం చేసింది. కానీ ఆమె చివరి నిమిషంలో ప్రమోషన్స్ లో పాల్గొనకుండా మెల్లగా జారుకుంది. ఇక గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ కి అయితే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన కూడా ఆమె ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా నటించిన కనెక్ట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయింది. పెళ్లి తర్వాత నయనతార నుండి వచ్చిన రెండవ సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం ఈమె ఎన్నడు లేని విధంగా ప్రమోషన్స్‌లో పాల్గొంది. పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ముఖ్యంగా ప్రముఖ యాంకర్ సుమా చేసిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ముందుగా సుమా ఆమెను ప్రశ్న అడుగుతూ గాడ్ ఫాదర్ సినిమా సమయంలో ప్రమోషన్ కోసం చిరంజీవి మిమ్మల్ని స్వయంగా అడిగిన మీరు నో చెప్పారట కదా! అని అడగగా దానికి నయనతార సమాధానం ఇస్తూ ఆ మూవీ విడుదల సమయంలో నేను ఫారిన్ ట్రిప్ లో ఉన్నాను. అందుకే ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోయాను. ఈ విషయం చిరంజీవి గారికి కూడా చెప్పి క్షమాపణలు కోరాను అని చెప్పింది. మొత్తానికి తన సొంత నిర్మాణ సంస్థ ఇద్దరు సినిమాలను ఆమె నుండి వచ్చే సినిమా కాబట్టి కనెక్ట్ కి నయనతార ప్రమోషన్స్ కు వచ్చిందని... కానీ చిరు రెండు చిత్రాలకు మాత్రం మొండిచేయి చూపిందని, సోషల్ మీడియా వేదికగా నయనతారపై మెగాఫ్యాన్స్ మండిపడుతున్నారు. పరభాష హీరోయిన్లను ఏరికోరి నెత్తి మీద పెట్టుకుంటే వచ్చే ప్రమాదం ఇదే. ఇక నయనను చూసి ఆమధ్య హీరోయిన్ త్రిష కూడా ఇలాగే బిహేవ్ చేసింది.
ఇక నయనతార తాను ప్రమోషన్స్‌కి ఎందుకు హాజరు కాను... అనే దానికి ఆమె ఇచ్చే సమాధానం కూడా తలా తోక ఉండదు. 18ఏళ్లకే నటిని అయ్యాను. ఆ తర్వాత అందరి దారిలోనే నేను కూడా నడిచాను. కానీ కొంత ఫేమ్ వచ్చిన తర్వాత అందరిలా కాకుండా విభిన్నంగా ఉండాలని ఆశించాను. సినిమా వేడుకలకు హీరోయిన్లు వచ్చినా ఏమీ ప్రయోజనం ఉండదు. అక్కడ హీరోని తప్ప హీరోయిన్ గురించి పట్టించుకోరు. అంతా హీరోల భజనే సాగుతుంది... అంటోంది...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



