Home

»

Latest News

నాగ్ హీరోగా మలినేని గోపీచంద్ చిత్రం

Feb 01, 2012

నాగ్ హీరోగా మలినేని గోపీచంద్ చిత్రం ఉంటుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యువ హీరోలతో పోటీపడుతూ సినిమా మీద సినిమా చేస్తున్న యువసామ్రాట్, కింగ్ నాగార్జున హీరోగా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై యమ్.యల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మలినేని గోపీచంద్ రవితేజ హీరోగా "డాన్ శీను", విక్టరీ వెంకటేష్ హీరోగా "బాడీ గార్డ్" చిత్రాలకు దర్శకత్వం వహించి విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం నాగార్జున "డమరుకం" చిత్రాన్ని పూర్తి చేసి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో "శిరిడి సాయి" చిత్రంలో సాయిబాబాగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దశరథ్ దర్శకత్వంలోని చిత్రంలో నాగ్ హీరోగా నటిస్తారు. దాని తర్వాత మలినేని గోపీచంద్ చిత్రం ఉంటుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com