ఎన్టీఆర్.. ఇది సార్ నా బ్రాండ్..!
on Feb 5, 2025
ఒకప్పటి తెలుగు సినిమా వేరు, ఇప్పటి తెలుగు సినిమా వేరు. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది. తెలుగు సినిమాల గురించి, తెలుగు హీరోల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఫిఫా వరల్డ్ కప్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఎన్టీఆర్ (NTR) పేరును ఒక బ్రాండ్ లా ఉపయోగించడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఇందులోని 'నాటు నాటు' పాట ఏకంగా ఆస్కార్ ను గెలుచుకుంది. ఈ క్రమంలో తాజాగా ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక ఆసక్తికర పోస్ట్ దర్శనమిచ్చింది. ఫిబ్రవరి 5న ముగ్గురు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులు నెయ్‌మార్, టెవెజ్, రోనాల్డో పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫిఫా వరల్డ్ కప్ హ్యాండిల్ లో "Mood when it's your birthday" అంటూ ఒక ఫొటోను షేర్ చేశారు. అందులో ముగ్గురు క్రీడాకారులు నాటు నాటు స్టెప్ వేస్తున్నట్టుగా ఉంది. అలాగే వారి ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో 'NTR' పేరును 'RRR' ఫాంట్ స్టైల్ లో రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకో విశేషం ఏంటంటే, ఈ పోస్ట్ చూసి సంతోషం వ్యక్తం చేసిన ఎన్టీఆర్.. నెయ్‌మార్, టెవెజ్, రోనాల్డోలకు బర్త్ డే విషెస్ తెలుపుతూ రిప్లయ్ ఇచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
