'ముసలోడికి దసరా పండుగ'.. నాజర్ తగ్గేదేలే
on May 25, 2022
'ముసలోడికి దసరా పండుగ' అనే సామెత ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో ఓ సినిమా రాబోతోంది. రమణ ఫిలిమ్స్ పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం 'ముసలోడికి దసరా పండుగ'. డి.మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నాజర్ ప్రధాన పాత్ర పోషించగా 'సీతమ్మ వాకిట్లో' ఫేమ్ అంజలి, 'నువ్వునేను' ఫేమ్ అనిత, కోవైసరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ ను తాజాగా నాజర్ విడుదల చేశారు. నాజర్ మాట్లాడుతూ.. "ఇందులో నా క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. "ఒకే ప్రపంచంలో రెండు భిన్నమైన జీవితాలు.. ఎంత నరకం ఇది" అంటూ ట్రైలర్ లో నాజర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో నాజర్ రెండు భిన్న కోణాల్లో కనిపిస్తున్నారు. వయస్సుకి తగ్గట్లు ఓ వైపు ముసలోడిగా, మరోవైపు వయస్సుకి సంబంధం లేకుండా కుర్రాడిలా కనిపిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ "ప్రేక్షకుడు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి సమానులైన ప్రముఖ దర్శకులు EVV సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్న" అని అన్నారు.
లక్షీ పతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇమాన్, ఎడిటర్ గా మధు వర్క్ చేస్తున్నారు.
Also Read