లైలా కోసం మెగాస్టార్..!
on Feb 6, 2025

విశ్వక్ సేన్ కథానాయకుడిగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లైలా' (Laila). షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైలా గా లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ అలరించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు మరో స్థాయికి తీసుకెళ్లడం కోసం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రంగంలోకి దిగుతున్నారు.
'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 9న నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్న మెగాస్టార్, తన తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన నిర్మాత సాహు కోసం 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి చిరంజీవి అంగీకరించినట్లు తెలుస్తోంది. పైగా ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తూ, యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



