Home

»

Latest News

మీనా ఖాతాలో మ‌రో ఓటీటీ మూవీ!

Jan 08, 2022

నాయిక‌గా కెరీర్ ఆరంభించి 30 ఏళ్ళు దాటినా.. ఇప్ప‌టికీ సీనియ‌ర్ స్టార్స్ కి జోడీగా న‌టిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు అభినేత్రి మీనా. మ‌రీముఖ్యంగా.. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, విక్ట‌రీ వెంక‌టేశ్ స‌ర‌స‌న ఇటీవ‌ల కాలంలో చెప్పుకోద‌గ్గ స్థాయిలో సినిమాలు చేశారు ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. రీసెంట్ గా.. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన `పెద్ద‌న్న‌`లోనూ ఓ స్పెష‌ల్ రోల్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఇదిలా ఉంటే.. గ‌త ఏడాది మీనా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రెండు సినిమాలు ఓటీటీలో ఎంట‌ర్టైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ లాల్ కి జంట‌గా న‌టించిన `దృశ్యం 2`, వెంకీకి జోడీగా అల‌రించిన `దృశ్యం 2`.. ఒకే క‌థాంశంతో ఒకే ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో 2021లో స్ట్రీమ్ అయి వీక్ష‌కాద‌ర‌ణ పొందాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మీనా న‌టించిన మ‌రో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధ‌మైంది. ఆ చిత్ర‌మే.. `బ్రో డాడీ`.  ఇందులోనూ మోహ‌న్ లాల్ స‌ర‌స‌న ఎంట‌ర్టైన్ చేయ‌బోతున్నారు మీనా. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ మాలీవుడ్ కామెడీ డ్రామా జ‌న‌వ‌రి 26న ప్ర‌ముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. మ‌రి.. మీనా ఖాతాలో హ్యాట్రిక్ ఓటీటీ హిట్ చేరుతుందేమో చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com