Home

»

Latest News

ఇదే నా మొట్టమొదటి పుట్టిన రోజంటున్న సూపర్ స్టార్ మహేష్ సోదరి 

Nov 8, 2023 6:36PM

సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న ఐదుగురి సంతానంలో ఒకరు మంజుల ఘట్టమనేని. యుక్త వయసులో ఉన్నప్పుడు  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో  హీరోయిన్ గా రాణించాలని మంజుల భావించింది. కానీ కృష్ణ గారి అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మంజుల హీరోయిన్ ప్రయత్నాల్ని మానుకుంది. కానీ నటన మీద ఉన్న మక్కువతో చాలా సంవత్సరాల  తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద  మంజుల నటించడం ప్రారంభించింది. కృష్ణ గారి అమ్మాయి మంజుల కూడా మంచి నటి అనే గుర్తింపుని కూడా ప్రేక్షకుల్లో సంపాదించింది.  తాజాగా మంజుల ఎక్స్ వేదికగా తన ట్విట్టర్ లో  ఎమోషనల్ గా చేసిన ఒక ట్వీట్ అండ్ ఒక పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ రోజు మంజుల తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ లో మా నాన్న లేకుండా జరుపుకుంటున్న మొట్ట మొదటి పుట్టిన రోజు అని ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ చేసింది. అలాగే  గత సంవత్సరం  సూపర్ స్టార్ కృష్ణ దగ్గరుండి మరి మంజుల చేత కేక్ కోయించడానికి ఏర్పాట్లు చేస్తున్న పిక్ ని కూడా మంజుల షేర్ చేసింది. ఆ పిక్ లో మహేష్ బాబు, నమ్రత ,మంజుల భర్త సంజయ్ ,కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు లు కూడా  ఉన్నారు. ఈ పిక్ చూసిన సూపర్ స్టార్ అభిమానులు తమ అభిమాన కధానాయకుడు కృష్ణ కి తన బిడ్డలంటే ఎంత ప్రేమో అని అనుకుంటున్నారు.

మంజుల చాలా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలనే పోషించింది. ఆరంజ్ సినిమాలో రామ్ చరణ్ అక్క  క్యారక్టర్ లోని ఆమె నటన ప్రేక్షకులకి నేటికీ గుర్తుండిపోతుంది. మంజుల రీసెంట్ గా వచ్చిన మంత్ ఆఫ్ మధు సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసల్నిసైతం  అందుకుంది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com