మంచు విష్ణు పోస్ట్ చేసింది నారా లోకేష్ గురించే
on Nov 30, 2024
ప్రముఖ హీరో మంచు విష్ణు(manchu vishnu)తన అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(kannappa)తో చాలా బిజీగా ఉన్నాడు.ఎంటైర్ విష్ణు కెరీర్లోనే హైబడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద విష్ణు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తుండగా ఏప్రిల్ 25 న మూవీ విడుదల కానుంది.ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు ఫ్యామిలీనే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది
ఇక రీసెంట్ గా మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి లోకేష్(nara lokesh)గారిని కలవడం జరిగింది.ఈ సందర్భంగా లోకేష్ తో దిగిన ఫోటోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ' మై బ్రదర్ ఉన్నత విద్య శాఖ మంత్రి లోకేష్ ని కలిసాను.ఎన్నో విషయాలపై ఇద్దరం చర్చించుకున్నాం.ఆయన పాజిటివ్ ఎనర్జీ అద్భుతం లోకేష్ గారు మరెన్నో విజయాల్ని అందుకోవాలని కోరుకుంటున్నానని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.
Also Read