Mana shankara varaprasad garu: నిక్కీ డీటెయిల్స్ ఇవే.. ఫాదర్ లేడు
on Jan 22, 2026

-నిక్కీగా స్క్రీన్ ని షేక్ చేస్తున్న ఖుషి
-తన స్వస్థలం ఎక్కడో తెలుసా
-అప్ కమింగ్ సినిమా ఏది!
నిక్కీ గా తన తండ్రి శంకర వరప్రసాద్(చిరంజీవి) ని ఒక రేంజ్ లో భయపెట్టిన నటి 'ఖుషి సోని'(Khushi Soni). అదే టైంలో తన క్యారక్టర్ కి తగ్గట్టుగా రిచ్ నెస్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించింది. అసలు తాను సిల్వర్ స్క్రీన్ పై కనపడినంత సేపు ప్రేక్షకుల చూపులు మొత్తం తనపైనే ఉండేలా ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్. దాంతో మూవీలో తానే ఒక సీన్ లో డైలాగ్ చెప్పినట్టుగా థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా ప్రేక్షకుల మనసుల్ని ఖుషి మెమొరీస్ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఖుషి కి సంబంధించిన డీటెయిల్స్ కోసం సెర్చింగ్ జరుగుతుంది.మరి తెలుగు వన్ ఇస్తున్న డిటైల్స్ ఇవే.
ఖుషి స్వస్థలం రాజస్థాన్. కానీ హైదరాబాద్ లో సుదీర్ఘ కాలం నుంచి తన తల్లితో కలిసి ఉంటుంది. తండ్రి లేడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెవెంత్ క్లాస్ చదువుతుంది. సినిమా హీరోయిన్ గా రాణించడమే తన లక్ష్యం. అది కూడా తెలుగు తప్ప ఇతర ఏ భాషలకి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఈ విషయాలన్నీ తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్వయంగా ఖుషి నే వెల్లడి చేసింది.
తన సినీ జర్నీ గురించి చెప్పుకోవాలంటే తన ఐదవ ఏట న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవడానికి తన తల్లితో పాటు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న జివికె మాల్ కి వెళ్ళింది. అక్కడ నాగార్జున నుంచి వచ్చిన వైల్డ్ డాగ్ మూవీ మేకర్స్ ఖుషిని చూడటం, వైల్డ్ డాగ్ లో చేస్తావా అని అడగడంతో తన సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత ఝాన్సీ, తో పాటు మొత్తం ఆరు సినిమాలు చేసింది. మన శంకర వర ప్రసాద్ తన సెవెంత్ మూవీ. ఆడిషన్స్ ద్వారానే తను సెలెక్ట్ అయ్యింది. నిక్కీ క్యారక్టర్ కి తనే తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



