Home

»

Latest News

'ఆచార్య'లో మహేష్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్!

Apr 21, 2022 12:48PM

చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు 23 న జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ రానున్నాడని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా ఓ సర్ ప్రైజ్ ఉందని సమాచారం. 'ఆచార్య'కు మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

'ఆచార్య' సినిమాలో చిరు, చరణ్ పాత్రలను మహేష్ వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తారని అంటున్నారు. గతంలో పవన్ నటించిన 'జల్సా', జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' సినిమాలకు మహేష్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ సినిమాలకు మహేష్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఆచార్యకు కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి. మహేష్ తో కొరటాల 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాలు చేశాడు. అలాగే మెగా ఫ్యామిలీతో మహేష్ కి మంచి అనుబంధం ఉంది. అందుకే కొరటాల అడగ్గానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మహేష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఆచార్యలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com