కింగ్‌డమ్ బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?
on Aug 4, 2025

దాదాపు ఏడేళ్ల నుంచి ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ.. జూలై 31న 'కింగ్‌డమ్'తో ప్రేక్షకులను పలకరించాడు. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బుకింగ్స్ బాగున్నాయి. దీంతో 'కింగ్‌డమ్' రూపంలో విజయ్ ఖాతాలో ఓ మంచి హిట్ పడినట్లేనని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (Kingdom)
ట్రేడ్ లెక్కల ప్రకారం.. రూ.52 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన కింగ్‌డమ్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ లో అనగా మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.36 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.17 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. మామూలుగా అయితే రెండో వీకెండ్ కల్లా ఈ మొత్తం రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఇప్పుడు 'కింగ్‌డమ్' ముందు పెద్ద టాస్క్ ఉంది.
'కింగ్‌డమ్'కి యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. దానికితోడు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'మహావతార్ నరసింహ' హవా ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమా విడుదలై పదిరోజులు అయినప్పటికీ 'కింగ్‌డమ్' కంటే బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. ఏ సినిమా అయినా వీక్ డేస్ లో డ్రాప్ కనిపించడం సహజం. కానీ, 'మహావతార్ నరసింహ' దెబ్బకు 'కింగ్‌డమ్' డ్రాప్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. అదే ఇప్పుడు, బ్రేక్ ఈవెన్ కష్టమేనా? అనే చర్చకు దారితీసింది. మరి కింగ్‌డమ్, అనూహ్యంగా పుంజుకొని సెకండ్ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ సాధించి సర్ ప్రైజ్ ఏమైనా చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



