Home

»

Latest News

రెండో ద‌శాబ్దంలో ఎంజాయ్ చేస్తున్న‌ దుల్క‌ర్‌!

Feb 04, 2023

సినిమా ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా కింగ్ ఆఫ్ కోత  సెకండ్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.   ఇంతకుముందు ఎప్పుడూ కనిపించ‌నంత స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తూ దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ పోస్ట్ రాశారు. 11 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్నాను. ఇప్పుడు  సినిమా ఇండస్ట్రీలో నా రెండో దశాబ్దం కొనసాగుతోంది. 

ఇంకా నటుడిగా ఎన్నో ఎన్నో ఎత్తులు చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అద్భుతమైన కథలను మీ అందరితో చెబుతూనే ఉంటాను. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాతో సినిమాలు తీసిన ఫిలిం మేకర్స్ కి, సహ నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను, నేను మీ అందరి నుంచి ఎంత ప్రేమ, ఆదరణ‌, ప్రోత్సాహం అభిమానాన్ని పొందానో, అంత‌కంతా తిరిగి ఇచ్చేస్తాను. నా మనసుకు తెలుసు... ఈ నన్ను ఇంతగా ఆదరిస్తున్న వారిని ఎప్పుడు, ఎక్కడ... తగ్గకుండా చూసుకోవాలని. అందుకే మాట ఇస్తున్నాను... శాయశ‌క్తులా కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. నా పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ నా ఎదుగుదలకు తోడ్పడుతున్న క్రిటిక్స్ కి కూడా మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ అందరితో కలిసి స్పెండ్ చేసే టైం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను`` అని అన్నారు దుల్కర్ .

సీతారామం, చుప్ వంటి సినిమాలతో అలరించిన దుల్కర్, ఈ ఏడాది కేఓకే తో ప్రేక్షకులను అలరిస్తానని మాట ఇచ్చారు. సెకండ్ షో అనే సినిమాతో యాక్టింగ్ కెరీర్‌ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ 11 వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా విడుదలవుతున్న ఈ కేఓకేని తెలుగు, తమిళ్, హిందీలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com