పుష్ప 2 పై పడ్డ కరణ్ జోహార్..బాలీవుడ్ అంటే ఏంటో చూపించాడు
on Jun 12, 2025

భారతీయ సినీ చరిత్రలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్(Karan Johar)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సరికొత్త ప్రేమకదా చిత్రాలని హిందీ చిత్ర సీమకి పరిచయం చేసిన కరణ్ జోహార్ ఆ తర్వాత పలు విభిన్న చిత్రాలని తెరకెక్కించి విశేష కీర్తిని గడించాడు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, కాజల్ కాంబోలో 1998 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' ఆయన మొదటి మూవీ కాగా, కభీ ఖుషి కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, బాంబే టాకీస్, ఘోస్ట్ స్టోరీస్ వంటి పలు చిత్రాలు ఉన్నాయి.
రీసెంట్ గా కరణ్ జోహార్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు బాలీవుడ్ లో ఈ మధ్యన ఎప్పుడు లేని విధంగా వింత ధోరణి మొదలయ్యింది. ఒక సినిమా విడుదలై మాస్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటే అదే ఐడియాని కాపీ కొట్టాలని చూస్తున్నారు. ఇటీవల చావా(Chhaava)స్త్రీ(Stree)పుష్ప 2(Pushpa 2)హిట్ కావడంతో అందరు అలాంటి సినిమా కథలపైనే దృష్టి పెట్టారు. అప్పటి వరకు అలాంటి తరహా కథలు రాలేదు కాబట్టే ఆ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. వ్యక్తిగత అభిప్రాయాలెప్పుడు ప్రేక్షకులని అలరిస్తాయని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.
నిర్మాతగాను సుమారు నలభై దాకా చిత్రాల దాకా నిర్మించిన కరణ్ జోహార్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలని హిందీలో రిలీజ్ చేసాడు. 2023 లో రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా తెరకెక్కిన 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని ' ఆయన దర్శకత్వంలో చివరగా వచ్చిన మూవీ. నటుడుగాను సుమారు పది చిత్రాల దాకా నటించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



