కాంతార చాప్టర్ 1 కి శాపం!.. దైవం ముందుగానే చెప్పింది
on Aug 12, 2025

పాన్ ఇండియా వ్యాప్తంగా 'రిషబ్ శెట్టి(Rishab Shetty)వన్ మాన్ షో 'కాంతార'(Kantara)మూవీ సాధించిన ఘన విజయం తెలిసిందే. పదిహేను కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుని, సుమారు నాలుగువందల కోట్ల వరకు వసూలు చేసింది. దీన్నిబట్టి కాంతర ప్రభంజనం ప్రేక్షకుల్లో ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోసారి ఆ ప్రభంజాన్ని సృష్టించేందుకు 'కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)'ని తెరకెక్కిస్తోంది. చాప్టర్ 1 లో చేసిన ముగ్గురు నటులు కొన్ని కారణాలతో చనిపోయారు. దీంతో కాంతార టీం కి ఏదైనా శాపం ఉందేమో అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తలపై కాంతార చాప్టర్ 1 ని నిర్మిస్తున్న'హోంబలే ఫిల్మ్స్(Homabale Films)'నిర్మాతల్లో ఒకరైన 'చలువే గౌడ'(Chaluve Gowda)మాట్లాడుతు సెట్ లో ఒకే ఒక అగ్నిప్రమాదం జరిగింది. మిగిలినవన్నీ సినిమాకి సంబంధం లేనివి. 2024 నవంబర్ లో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంతో పాటు, 2025 జనవరిలో బెంగుళూరు లో జరిగిన ప్రమాదాలలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. ఆ తర్వాత రీసెంట్ గా రిషబ్ శెట్టి తో పాటు కొంత మంది టీం సభ్యులు పడవ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మనమంతా దేవుడి పట్ల భక్తి, భయంతో ఉంటు రోజు పూజిస్తాం. ఏ పని చేసిన దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతాం. మేము కూడా చాప్టర్ 1 ప్రకటన చేసే ముందు 'పంజుర్లి' కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందని అడిగాం. కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. కానీ వాటన్నింటిని అధిగమించి విజయంతంగా పూర్తి చేస్తారనే సమాధానం వచ్చింది. అప్పట్నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం చలువ గౌడ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
ఆధునిక కర్ణాటకలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న 'తుళునాడు' ప్రజలు 'పంజుర్లి'(Panjurli)ని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. పరమేశ్వరుడు తమని రక్షించాడనికే 'పంజుర్లి ని పంపించాడని అక్కడి వాళ్ళు నమ్ముతారు. అందుకు సంబంధించి పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కాంతార లో పంజుర్లి కి సంబంధించిన వేషధారణలోనే రిషబ్ శెట్టి కనిపిస్తాడు. కాంతార చాప్టర్ 1 దసరా కానుకగా అక్టోబర్ 2 న విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



