Home

»

Latest News

రామ్ కందిరీగ ఆగస్టు 12 న రిలీజ్

Jul 24, 2011

రామ్ "కందిరీగ" ఆగస్టు 12 న రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, 'దేశముదురు' పాప హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, కలర్స్ స్వాతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం" కందిరీగ". రామ్ "కందిరీగ" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ శ్రియ శరణ్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించనుంది.

రామ్ "కందిరీగ" చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కాస్త ఆలస్యమవటం వల్ల రామ్ "కందిరీగ" చిత్రాన్ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. రామ్ "కందిరీగ" చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తూందని ఈ చిత్రం యూనిట్ అంటోంది. అలగే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండే రామ్ "కందిరీగ" చిత్రానికి కూడా మంచి స్పందన లభిస్తుందని ఈ చిత్రం యూనిట్ అంటోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com