Home

»

Latest News

అన్న‌పూర్ణ కాంబోలో హ్యాట్రిక్ దక్కేనా!

Nov 24, 2021 5:01PM

2016 సంక్రాంతికి విడుద‌లైన `సోగ్గాడే చిన్ని నాయ‌నా`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే కింగ్ నాగార్జున వంటి అగ్ర క‌థానాయ‌కుడిని డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా.. సెన్సేష‌న‌ల్ హిట్ ని త‌న సొంతం చేసుకున్నాడు. ఆపై నాగ్ త‌న‌యుడు, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో `రారండోయ్.. వేడుక చూద్దాం!` (2017)ని రూపొందించి.. మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే, క‌ళ్యాణ్ మూడో సినిమాగా వ‌చ్చిన `నేల టిక్కెట్టు` మాత్రం నిరాశ‌ప‌రిచింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబోలో చేసిన ఈ చిత్రం త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్నాడు క‌ళ్యాణ్ కృష్ణ‌.

క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం త‌న ఫ‌స్ట్, సెకండ్ చిత్రాల్లోని హీరోలు, అక్కినేని తండ్రీకొడుకులు నాగ్, చైతూ కాంబోలో `బంగార్రాజు` తీస్తున్నాడు క‌ళ్యాణ్. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ మ‌ల్టిస్టార‌ర్.. 2022 సంక్రాంతిని టార్గెట్ చేసుకుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. క‌ళ్యాణ్ మొద‌టి రెండు చిత్రాల‌ను నిర్మించిన నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ నే `బంగార్రాజు`ని కూడా నిర్మిస్తోంది. మ‌రి.. అన్న‌పూర్ణ స్టూడియోస్ కాంబోలో క‌ళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ కొడ‌తాడేమో చూడాలి.

అన్న‌ట్టు.. ఈ రోజు (న‌వంబ‌ర్ 24) క‌ళ్యాణ్ కృష్ణ పుట్టిన‌రోజు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com