Home

»

Latest News

మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్

Apr 19, 2022 6:47PM

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్రముఖ సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయాని సోషల్ మీడియా వేదికగా కాజల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. భయానితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2020 అక్టోబర్‌ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లును కాజల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన కాజల్..  ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి బేబీ బంప్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ వచ్చిన కాజల్.. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com