Home

»

Latest News

ఇక కమల్ ఆర్‌ ఖాన్ రివ్యూలకు గుడ్ బై!

Jan 4, 2023 10:29AM

సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు కూడా కె ఆర్ కె అలియాస్ క‌మ‌ల్ ఆర్ ఖాన్  సుపరిచితుడు. హిందీ సినిమాలకు రివ్యూ లు  ఇచ్చే ఈయన సల్మాన్ ఖాన్ మొదలుకొని ప్రతి ఒక్కరి సినిమాలకు  జెన్యూన్ రివ్యూ ఇస్తానంటూ ఆయన ఇచ్చే రివ్యూలు ప్రతిసారి వివాదాస్పదం అవుతుంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సూపర్ గా ఉందంటాడు. ఆచార్య సినిమాకు తిరుగులేదంటాడు. వాల్తేరు వీర‌య్య‌లో చిరు మరీ రొమాంటిక్‌గా కనిపించడం ఏమిటని విపరీత వ్యాఖ్యలు చేస్తాడు.

కమల్ ఆర్‌ ఖాన్ యొక్క రివ్యూ లో 99 శాతం రివ్యూలు వివాదాలనే కలిగి ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల‌ను ఓ రేంజిలో ఏకిపారేస్తుంటాడు. దాంతో బాలీవుడ్ లోని కొంద‌రు ముందుకువ‌చ్చి  తన పేరు కోసం, బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇలా రివ్యూలు ఇచ్చి చాలా సినిమాలకు నష్టం కలిగిస్తున్నాడని నెత్తి నోరు బాదుకున్నారు.  మొత్తానికి ఈయన రివ్యూ నమ్మినా నమ్ముకున్న చాలామంది ఈయ‌న రివ్యూలను చాలా లైట్ గా తీసుకుంటారు. ఇక సల్మాన్ ఖాన్ కు ఈయనకు మధ్య చట్టపరమైన వాదనలు నడుస్తున్నాయి. త‌న‌పై ప‌రువు న‌ష్టం దావా వేసిన  సల్మాన్ ఖాన్ ను ఈయన అదే స్థాయిలో ఢీకొడుతున్నాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఫిలిం మేకర్స్ తో పాటు స్టార్స్ ని దర్శకుల‌ని ఊపిరి పీల్చుకునే విధంగా ఈ వార్త ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఆయన ట్విట్టర్ లో మాట్లాడుతూ ప్రియమైన మిత్రులారా నేను 100% నిజం చెప్తున్నాను. పఠాన్ సినిమా తర్వాత మరే సినిమాకు రివ్యూ చెప్పను. ఇన్నాళ్లు నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు... అంటూ ట్విట్ చేశాడు. అసలు ఆయ‌న మాట‌లు ఎంతవరకు నమ్మవచ్చు?  ఆయన మాట మీద నిలబడతాడా? అనే అనుమానాలు ప్ర‌స్తుతం చాలా మందిని వేధిస్తున్నాయి.  ఈ విష‌యంలో చాలా మంది ఆయ‌న మాట‌ల‌ను న‌మ్మ‌లేమ‌ని  అత్యధిక మంది కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ తో హిందీ ప్రేక్షకులు పరిచయమై నటునిగా కూడా చాలా చిత్రాల్లో నటించాడు.

ఏ ఒక్కటి ఆయన గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో రివ్యూ రైటర్ గా అవ‌తారం ఎత్తాడు. వివాదాస్పద వ్యాఖ్యలు... బాగున్న సినిమాలను బాగాలేదని చీల్చి చెండాడ‌టం వంటి అడ్డమైన  ప‌ద్ద‌తుల  కారణంగానే ఆయనకు  అనుకున్నట్టుగా గుర్తింపు, ఆదాయం కూడా సమకూరాయి. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాడు. ఇక ఈయన రివ్యూలను వదులుకుంటాడా లేదా అనేది అనుమానమే అయినప్పటికీ కొంత కాలం మాత్రం ఆయన స్టేట్మెంట్లను చూస్తూ ఊపిరి పీల్చుకోవ‌చ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com