సూర్య కంటే విజయ్ బెటర్..జ్యోతిక రిప్లైకి మైండ్ బ్లాంక్
on Feb 27, 2025

స్టార్ హీరో సూర్య(Suriya)ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్(karthik Subbaraj)దర్శకత్వంలో 'రెట్రో' మూవీతో పాటు,ఆర్ జె బాలాజీ(Rj Balaji)దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకి సంబంధించిన షూటింగ్ లోను బిజీగా ఉన్నాడు.'లక్కీ భాస్కర్' తో విజయాన్ని అందుకున్న'వెంకీ అట్లూరి'(Venki atluri)దర్శకత్వంలోను ఒక మూవీ చేస్తున్నాడనే టాక్ అయితే ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.
సోషల్ మీడియాలో రీసెంట్ గా ఒక నెటిజన్ సూర్య కంటే విజయ్(Vijay)బెటర్,ప్రదీప్ రంగనాధన్ (Pradeep Ranganadhan)సినిమా కలెక్షన్స్ లని, సూర్య గత చిత్రానికి సంబంధించిన కలెక్షన్స్ తో పోలుస్తు కూడా కామెంట్ చేసాడు.ఇప్పుడు ఆ కామెంట్స్ కి సూర్య వైఫ్, ఒకప్పటి హీరోయిన్ 'జ్యోతిక' నవ్వు ఎమోజి ని పోస్ట్ చేసింది.దీంతో ఇప్పుడు జ్యోతిక చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. జ్యోతిక, సూర్య 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అంతకు ముందు ఈ ఇద్దరు కొన్నిసినిమాల్లో జంటగా కూడా నటించారు.కొన్ని నెలల క్రితం ఆ ఇద్దరు విడిపోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవి ఒట్టి పుకార్లే అని సూర్య, జ్యోతిక వెల్లడి చేసారు.ప్రస్తుతం ఈ జంట ముంబై లో నివాసం ఉంటుంది.
జ్యోతిక ప్రస్తుతం 'డబ్బాకార్టెల్'(Dabba Cartel)అనే హిందీ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో చేస్తుంది. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగాస్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో జ్యోతిక ఫుల్ బిజీగా ఉంది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



