Home

»

Latest News

యన్.టి.ఆర్. కొత్త చిత్రం "బాద్ షా"

Feb 13, 2012

యన్.టి.ఆర్. కొత్త చిత్రం "బాద్ షా". వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, దూకుడు మీదున్న డైనమిక్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, బంఢ్ల గణేష్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రానికి "బాద్ షా" అన్న పేరుని నిర్ణయించారని సమాచారం. ఈ "బాద్ షా" చిత్రానికి "యాక్షన్ విత్ ఎంటర్ టైన్ మెంట్" అన్న క్యాప్షన్ కూడా నిర్ణయించారట. సినిమా పేరు కొంచెంగా ఉన్నా చాలా పవర్ ఫుల్ టైటిల్ అనీ, దానికి తగ్గట్టే క్యాప్షన్ కూడా బాగా కుదిరిందనీ ఈ చిత్రం యూనిట్ సంతోషంగా ఉంది.

ఈ "బాద్ షా" యాక్షన్ విత్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం రానున్న మార్చ్ నెలలో ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. యన్.టి.ఆర్. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో, అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న "దమ్ము" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com