Home

»

Latest News

'జై హనుమాన్' ఫస్ట్ లుక్.. ఇది అసలైన దీపావళి ట్రీట్ అంటే...

Oct 30, 2024

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'జై హనుమాన్' (Jai Hanuman) మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. హనుమంతుడిగా రిషబ్ శెట్టి రూపం కట్టిపడేస్తోంది. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. (Jai Hanuman First Look)

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన 'హనుమాన్' మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా సక్సెస్ ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా 'జై హనుమాన్' (Jai Hanuman) రూపొందుతోంది. హనుమంతుడి పాత్ర 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి పోషిస్తున్నారు.

'జై హనుమాన్' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. శ్రీరాముని విగ్రహాన్ని పట్టుకొని హనుమంతుని రూపంలో ఉన్న రిషబ్ లుక్ ఆకట్టుకుంటోంది. హనుమంతుని పాత్రకి రిషబ్ ఎంపిక సరైనదని పోస్టర్ తోనే స్పష్టమవుతోంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com