'వారసుడు' కాదిది.. 'మహర్షి-2'!
on Jun 22, 2022
కోలీవుడ్ స్టార్ విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి తమిళ్ లో 'వారిసు', తెలుగులో 'వారసుడు' అనే టైటిల్స్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. నేడు(జూన్ 22) విజయ్ పుట్టినరోజు కావడంతో తాజాగా ఈ మూవీ నుంచి రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. అయితే ఈ పోస్టర్స్ చూసిన నెటిజన్లు "వారసుడు కాదిది.. మహర్షి-2" అంటూ ట్రోల్ చేస్తున్నారు.
వంశీ డైరెక్ట్ చేసిన గత చిత్రం 'మహర్షి'(2019)లో మహేష్ బాబు హీరోగా నటించాడు. అందులో ఒక యూఎస్ కంపెనీకి సీఈఓ అయిన రిషి కుమార్ గా నటించిన మహేష్.. తన స్నేహితుడి కోసం ఇండియాకి వచ్చి ఎన్నో ఊళ్లను వ్యవసాయానికి దూరం కాకుండా కాపాడతాడు. అయితే తాజాగా విడుదలైన 'వారసుడు' పోస్టర్స్ మహర్షి సినిమాని గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. ఫస్ట్ పోస్టర్ లో విజయ్ సూట్ ధరించి స్టైలిష్ గా ఫారెన్ కంపెనీ సీఈఓలా కనిపిస్తున్నాడు. సెకండ్ పోస్టర్ లో విలేజ్ లో సరుకులు తీసుకెళ్తున్న ఒక ట్రక్ లో పిల్లలతో కలిసి విజయ్ జర్నీ చేస్తున్నట్లు ఉంది. మహర్షి సినిమాలో లాగే ఇందులో కూడా హీరో ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ సమస్య తీరుస్తాడని అర్థమవుతుందని, చూస్తుంటే ఇది 'మహర్షి-2' లాగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు వారసుడు పోస్టర్స్ తో 'మహర్షి-2' హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.
ఇంకా కొందరైతే ఇది వంశీ పైడిపల్లి సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ 'విక్రమ్' సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పీరియన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే బాటలో వంశీ కూడా వెళ్తున్నట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిషి కుమార్ కొడుకు పాత్రలో విజయ్ కనిపించనున్నాడని, అందుకే ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ పెట్టారని అంటున్నారు. మరి ఈ 'వారసుడు' పోస్టర్స్ మాత్రమే 'మహర్షి'ని గుర్తు చేస్తాయో.. సినిమా కూడా అలాగే ఉంటుందో చూడాలి.
Also Read