
-నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఇరుముడి
-ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచే ప్యూర్ పాజిటివ్ టాక్
-దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్స్
అందరు అనుకున్నట్టుగానే మాస్ మహారాజ ఇరుముడి సూపర్ డూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. నిన్న ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచే హిట్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ గా రిలీజైన ఆల్ థియేటర్స్ హౌస్ ఫుల్. ఎన్నడూ లేని విధంగా మల్టీప్లెక్స్ లో ఒక్క సీట్ కూడా ఖాళీ లేదంటే ఇరుముడి రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.
దీంతో ఇరుముడి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 24 .20 కోట్ల రికార్డు స్థాయి గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియాలో 17 .20 కోట్లు కాగా మిగతా 7 కోట్లు ఓవర్సీస్ నుంచి రాబట్టింది. ఈ తొలిరోజుకి సబంధించిన కలెక్షన్స్ ఎంటైర్ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ గా చెప్పుకోవచ్చు. దీంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. నిన్న సాయంత్రం ఆరుగంటల ఆటకి సైతం అభిమానులు థియేటర్స్ ని వదిలి వెళ్లకుండా ప్రేక్షకులకి ఇరుముడి రిబ్బన్స్ పంచుతున్నారంటే ఫ్యాన్స్ ఎంత ఖుషిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
Also read: కాకా టైటిల్ గ్లింప్స్ అదుర్స్.. జనవరి 13 న రాక
కలెక్షన్స్ వివరాలని ఏరియాల వారీగా పరిశీలిస్తే, 15 కోట్ల గ్రాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే వచ్చింది. కర్ణాటకలో 1.50 కోట్లు, తమిళనాడులో 34 లక్షలు, కేరళ తో ఇతర ప్రాంతాల నుండి 36 లక్షల వరకు వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు వెర్షన్ ప్రదర్శనల్లో ఉదయం ఆటలకి 66.69% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం 73.62%, సాయంత్రం షోలకు 78.69%, రాత్రి షోలకి అత్యధికంగా 88.08% ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఈ లెక్కలు ఇరుముడి సృష్టించబోయే సునామిని స్పష్టంగా సూచిస్తున్నాయి.బుక్ మై షో తో పాటు పలురకాల యాప్స్ లో సండే వరకు టికెట్స్ బుక్ కావడమే ఉదాహరణ. దీంతో ఈ వీకెండ్ కి వంద కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. తండ్రి, కూతురు సెంటిమెంట్ కి ప్రతి ఒక్కరు ఇరుముడికి బందీ అవుతున్నారు.
Irumudi, Raviteja, Nakshtra, Priya Bhavani Shankar, Shiva Nirvana





