హెబ్బాతో రామ్ స్పెషల్ సాంగ్ అబ్బా
on Mar 4, 2020
కథానాయక పాత్రల నుండి కుమారి హెబ్బా పటేల్ దాదాపుగా పక్కకు తప్పుకున్నట్టే! 'కుమారి 21ఎఫ్' చిత్రంతో వచ్చిన క్రేజ్ వల్ల వరుసగా సినిమాలకు సంతకాలు చేశారు. ఎడాపెడా ఏదొస్తే అది ఒక ఒప్పేసుకున్నారు. అందులో ఆమెకు నటిగా పేరు తీసుకువచ్చినవీ, భారీ విజయాలను అందించినవీ తక్కువే. అందువల్ల, మెల్లగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో కథానాయిక పాత్రలపై కాకుండా ప్రత్యేక పాత్రలు, పాటలపై దృష్టి సారించారు. మొన్నటికి మొన్న నితిన్ 'భీష్మ' చిత్రంలో ప్రారంభంలోనూ, చివర్లోనూ తళుక్కున మెరిశారు. తాజాగా రామ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రెడ్'. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది పక్కా మాస్ సాంగ్ అని సమాచారం. తమిళంలో హిట్ అయినా థ్రిల్లర్ సినిమా రీమేక్ ఈ 'రెడ్'. చాలా సీరియస్ గా సాగుతుంది. మదిలో ప్రేక్షకులకు రిలీఫ్ కోసమని ఐటమ్ సాంగ్ స్పెషల్ గా ఉండేలా డిజైన్ చేశారట.