Home

»

Latest News

బిగ్ బాస్ బ్యూటీపై అత్యాచారం.. పరారీలో యూట్యూబర్ హర్ష సాయి!

Sep 25, 2024 9:17AM

ఇటీవల పలువురు యూట్యూబర్లు, సినీ సెలబ్రిటీలపై.. లైంగిక వేధింపులు, ప్రేమ పేరుతో మోసం వంటి ఆరోపణలు, కేసుల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఘటన తెరపైకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, ఆ యువతి ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అని న్యూస్ వినిపిస్తోంది. (Youtuber Harsha Sai)

హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదులో పలు సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తనపై అత్యాచారం జరపడమే కాకుండా.. ఆ సమయంలో నగ్న ఫోటోలు, వీడియోలు తీసి.. అవి అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదు చేసిందంట. అంతేకాకుండా తన దగ్గర నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని తెలిపిందట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఫోన్ ద్వారా హర్షసాయితో మాట్లాడే ప్రయత్నం చేయగా.. అతను అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com