Home

»

Latest News

టీజ‌ర్ రివ్యూ :  గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి

Oct 12, 2016 10:44AM

 

నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ద‌స‌రా సంద‌ర్భంగా టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఎప్పుడెప్పుడా అని గంపెడాశ‌ల‌తో ఎదురుచూస్తున్న బాల‌య్య ఫ్యాన్స్ టీజ‌ర్ రాక‌తో ఖుషీ అయ్యారు.  స‌మ‌యం లేదు మిత్ర‌మా...  శ‌ర‌ణ‌మా, ర‌ణ‌మా?  అనే డైలాగ్ త‌ప్ప‌కుండా బాల‌య్య ఫ్యాన్స్‌కి న‌చ్చుతుంది. 40 సెక‌న్ల టీజ‌ర్‌లో వీఎఫ్ఎక్స్ షాట్స్‌కూడా ఉన్నాయి. బాహుబ‌లి రేంజులో యుద్ద స‌న్నివేశం చూపించారు. అయితే.. ఇలాంటి షాట్స్ ఇప్పుడు టాలీవుడ్‌కి కొత్తేం కాదు. బాహుబ‌లి నుంచి మొన్న విడుద‌లైన కాష్మోరా టీజ‌ర్లో కూడా సేమ్ టూ సేమ్ షాట్స్ ఉన్నాయి. క‌త్తి యుద్దం కూడా ఏమంత గొప్ప‌గా లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అస‌లు స‌రుకంతా దాచేసి, కొస‌రు చూపించాల‌నుకొన్నారేమో?  లేదంటే అంచ‌నాలు మ‌రింత పెరిగిపోతాయ‌ని చిత్ర‌బృందం భ‌య‌పెట్టిందేమో?  అంచ‌నాల స్థాయిలో లేక‌పోయినా.. గౌత‌మి పుత్ర టీజ‌ర్ ఓకే అనిపించేలా ఉంది. బాల‌య్య అభిమానులు మాత్రం అప్పుడే త‌మ సినిమా బాహుబ‌లి రికార్డుల్ని బ్రేక్ చేసినంత సంబ‌ర‌ప‌డుతున్నారు. ఫ్యాన్స్ వ‌ర‌కూ ఈ టీజ‌ర్ సూప‌ర్ హిట్టే అనుకోవాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com