గేమ్ చేంజర్ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
on Jan 11, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)దిల్ రాజు(Dil Raju)కాంబోలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై తెరకెక్కిన ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(Game changer)నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీలో'రామ్ నందన్' అనే ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా, 'అప్పన్న' అనే ఒక సామాజిక కార్యకర్తగా చరణ్ సెటిల్డ్ పెర్ఫార్మ్ ఒక రేంజ్ లో ఉందనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది.
ఇక 'గేమ్ చేంజర్' తొలి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా మేకర్స్ తెలియచేసారు.ఈ మేరకు అన్ స్టాపబుల్ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ అంటు మేకర్స్ అధికారకంగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది.మరి తొలి రోజే 186 కోట్ల గ్రాస్ ని సాధించిందంటే,ముందు ముందు ఏ మేర వసూళ్ళని రాబడుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. 225 కోట్ల బ్రేక్ ఎవెన్యూ టార్గెట్ తో 'గేమ్ చేంజర్' విడుదల అవ్వగా తొలి రోజు ఆక్యుపెన్సీ పరంగా అన్ని ఏరియాల్లో మంచి రికార్డునే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించగా,కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లుగా చేసారు.ఎస్ జె సూర్య,శ్రీకాంత్, సముద్ర ఖని,సునీల్,రాజీవ్ కనకాల,జయరాం కీలక పాత్రలు పోషించారు.అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ తో గేమ్ చేంజర్ తెరకెక్కిందనే విమర్శలు వస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
