Home

»

Latest News

'ఆర్‌ఆర్‌ఆర్‌' కలెక్షన్.. సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయండి అంటున్న రానా!

Sep 22, 2021 4:50PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ ని నిరాశ చెందకుండా ఉండటం కోసం.. మూవీ మేకర్స్ కొత్త కొత్త సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' నుండి తారక్, చరణ్ ల పాత్రలకి సంబంధించిన లోగోలతో టీ షర్ట్‌లు, కప్పులు, మాస్కులు తదితర వస్తువుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫొటోల్ని తాజాగా రానా దగ్గుబాటి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'చరణ్‌, ఎన్టీఆర్‌ & సినిమా అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయండి' అంటూ ట్వీట్ చేశారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' టీ షర్ట్స్, కాఫీ మగ్స్, పోస్టర్స్, ఫేస్ మాస్కులు ఆకట్టుకుంటున్నాయి. టీషర్ట్ రూ .599 గా, కాఫీ మగ్ రూ .399, ఫేస్ మాస్క్ రూ.149 గా ధరలను నిర్ణయించారు. ఇవి ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ పేరిట 'fullyfilmy.in' లో అందుబాటులో ఉన్నాయి. ముందు ముందు ఈ కలెక్షన్ లో మరిన్ని వస్తువులు చేరనున్నాయట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com