Home

»

Latest News

`స‌లార్` విల‌న్ గా `ఫ్యామిలీ మ్యాన్`

Aug 20, 2021 2:36PM

మ‌నోజ్ బాజ్ పాయ్.. ప‌రిచ‌య వాక్యాలు అక్క‌ర్లేని పేరు. వేర్వేరు విభాగాల్లో ముచ్చ‌ట‌గా మూడు జాతీయ పుర‌స్కారాలు అందుకున్న వైనం ఈ వెర్స‌టైల్ యాక్ట‌ర్ సొంతం. రీసెంట్ టైమ్స్ లో `ఫ్యామిలీ మ్యాన్` సిరీస్ తో మ‌రింత పాపుల‌ర్ అయ్యారు మ‌నోజ్. ఇక‌, తెలుగు ప్రేక్ష‌కుల‌తోనూ మ‌నోజ్ కి మంచి అనుబంధ‌మే ఉంది. `స‌త్య‌` వంటి అనువాద చిత్రంతో పాటు `ప్రేమ‌క‌థ‌`, `హ్యాపీ`, `పులి`, `వేదం` వంటి స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ తోనూ ఇక్క‌డివారికి బాగా చేరువ‌య్యారు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్.

ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌నోజ్ మ‌రో తెలుగు చిత్రంలో న‌టించ‌బోతున్నార‌ట‌. అది కూడా.. ఓ పాన్ - ఇండియా మూవీ కోసం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్` పేరుతో ఓ యాక్ష‌న్ సాగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా మ‌నోజ్ ఎంపిక‌య్యార‌ని స‌మాచారం. అంతేకాదు.. త‌న పాత్ర స‌రికొత్త‌గా ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే `స‌లార్`లో మ‌నోజ్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

శ్రుతి హాస‌న్ నాయిక‌గా న‌టిస్తున్న `స‌లార్`.. 2022 ఏప్రిల్ 14న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com