Home

»

Latest News

ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి వస్తున్న ఆ వార్తలు నమ్మకండి!

Sep 13, 2024 11:35AM

 

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఎందరో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు విరాళాలను ప్రకటించారు. అటు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ఇటు రామ్ చరణ్ (Ram Charan) కూడా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున, చెరో కోటి రూపాయలు ప్రకటించారు. అయితే ఏపీకి ప్రకటించిన విరాళాన్ని చెక్ ల రూపంలో అందించడం కోసం.. ఎన్టీఆర్, చరణ్ ఈరోజు సీఎం చంద్రబాబు(Chandrababu)ని కలవబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం ట్రావెలింగ్ లో ఉన్నారని, సీఎం చంద్రబాబుని కలుస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని.. ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు సైతం.. ఆయన చంద్రబాబుని కలుస్తున్నారన్న వార్తలను తోసిపుచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' (Devara) ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారని తెలిపాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com