Home

»

Latest News

Sancharame: లండన్ లో తెలంగాణ పాట.. గోరేటి వెంకన్న 'సంచారమే' సాంగ్ అదిరింది!

Mar 09, 2026

బ్లాక్‌బస్టర్ 'బేబీ' జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’(EPIC - First Semester). '90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు.

‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'సంచారమే' తాజాగా విడుదలైంది. ప్రజాకవి గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం. "తొలి తొలి ప్రేమలు.. తొలకరి మాటలు.. సలి సలి వెట్టంగా.. సాగర తీరాన సంచారమే" అంటూ మట్టి పరిమళాన్ని వెదజల్లేలా ఆయన లిరిక్స్ ఉన్నాయి. ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ తో కలిసి గోరేటి వెంకన్న కూడా ఆలపించడం మరో విశేషం.

'సంచారమే' లిరికల్ వీడియో కాకుండా, డైరెక్ట్ గా వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. లండన్ విజువల్స్, తెలంగాణ యాస లిరిక్స్ తో రూపొందిన ఈ సాంగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గోరేటి వెంకన్న సాహిత్యం, గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జోడి తెరపై చూడటానికి బాగుంది.

'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'ను భావోద్వేగాలతో కూడిన మృదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. యువ హృదయాల అమాయకత్వం, సంఘర్షణలు, మౌన భావాలను ప్రతిబింబించే సరికొత్త, మధురమైన ప్రేమకథకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com