Home

»

Latest News

మహేష్ బాబు దూకుడు ఆడియో మే 31 రిలీజ్‍

Mar 28, 2011

dookudu wallpapers, dookudu stills, dookudu images, dookudu pics, dookudu photos, dookudu picturesమహేష్ బాబు దూకుడు ఆడియో మే 31 రిలీజ్‍ చేయబడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో అనీల్ సుంకర, గోపీ ఆచంట సమయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "దూకుడు". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబయ్ లో జరుగుతూంది. ముంబయ్ లో ఈ "దూకుడు" చిత్రానికి సంబంధించి హీరో మహేష్ బాబు ఇన్ ట్రడక్షన్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

అనంతరం మరో పది రోజుల వరకూ "మహేష్ బాబు ఈ "దూకుడు" చిత్రం షుటింగ్ కోసం ముంబయ్ లోనే ఉంటారు. కారణం ఏమిటంటే ముంబయ్ లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని ఆయన చూడనున్నారని సమాచారం. ఈ "దూకుడు" చిత్రంలో హీరో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని తెలిసింది. ఈ "దూకుడు" చిత్రం ఆడియో మే నెలలో 31 వ తేదీన ఘనంగా రిలీజ్ చేయబడుతుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com