Home

»

Latest News

పఠానీని "బఠాణీ"లా నలిపేశారు..

Dec 14, 2016 2:51PM

భారతదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపై హీరో, హీరోయిన్లు చేసే విన్యాసాలతో మైమరిచిపోయే అభిమానులు..వాళ్లని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు. వారి పుట్టినరోజులకు పలు సేవాకార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని ఘనంగా చాటుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఈ అభిమానం హద్దులు దాటుతోంది..హీరో, హీరోయిన్లను తాకాలనో..సెల్ఫీలు దిగాలనో వారికి విసుగొచ్చేలా చేయడం మనం వింటూనే ఉన్నాం..ఈ క్రమంలో తారలు బయట కనిపించాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంది దిశా పఠానీ.

పూరీ-వరుణ్ తేజ్‌ కాంభినేషన్‌లో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది దిశా. రీసెంట్‌గా విడుదలైన ధోని మూవీతో బాలీవుడ్‌లో ఫుల్ ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం జాకీచాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న కుంగ్‌ఫూ యోగా అనే హాలీవుడ్ మూవీలో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. అసలు మ్యాటర్‌లోకి వెళితే..ఏదో పని మీద బయటకు వచ్చిన దిశ..తనను ఎవరు గుర్తుపట్టరనుకుని ముఖానికి స్కార్ఫ్‌ కూడా కట్టుకోకుండా అలాగే తిరిగేసింది. మరీ జనాలు ఊరుకుంటారా..? వెంటనే గుర్తుపట్టేసిన అభిమానులు సెల్ఫీ సెల్ఫీ అంటూ ఇబ్బంది పెట్టారట..ఎలాగొలా తన కారు వద్దకు చేరుకున్న దిశా దేవుడా..అంటూ అక్కడి నుంచి బయటపడింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com