Home

»

Latest News

`ఎనిమీ`తో మ‌ళ్ళీ ట్రాక్ లోకి వ‌చ్చేనా!

Nov 3, 2021 4:09PM

త‌క్కువ చిత్రాలే తీసినా.. అన‌తికాలంలోనే త‌మిళ‌నాట ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేశాడు ఆనంద్ శంక‌ర్. 2014లో విడుద‌లైన `అరిమా నంబి` (విక్ర‌మ్ ప్ర‌భు, ప్రియా ఆనంద్ హీరోహీరోయిన్లు) కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఆనంద్.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మంచి విజ‌యం అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమా మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా `డైన‌మైట్`(2015) పేరుతో రీమేక్ అయింది.  ఇక `అరిమా నంబి` త‌రువాత ఆనంద్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన `ఇరు ముగ‌న్` (విక్ర‌మ్, న‌య‌న‌తార‌, నిత్యా మీన‌న్) కూడా కోలీవుడ్ లో హిట్ మూవీగా నిలిచింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ద‌ర్శ‌కుడిగా ఆనంద్ శంక‌ర్ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు.

అయితే, మూడో సినిమా మాత్రం ఆనంద్ కి నెగ‌టివ్ రిజ‌ల్ట్ ఇచ్చింది. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ కోలీవుడ్ డెబ్యూగా తెర‌కెక్కిన ఆ సినిమానే `నోటా`. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అనూహ్యంగా ప‌రాజ‌యం పాల‌య్యింది. ఈ నేప‌థ్యంలో.. రాబోయే చిత్రం `ఎనిమీ`పైనే ఆశ‌లు పెట్టుకున్నాడు ఆనంద్ శంక‌ర్. విశాల్, ఆర్య‌, ప్ర‌కాశ్ రాజ్, మ‌మ‌తా మోహ‌న్ దాస్, మృణాళిని ర‌వి  వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. దీపావ‌ళి కానుక‌గా రేపు (న‌వంబ‌ర్ 4) థియేట‌ర్స్ లోకి రాబోతోంది. తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానున్న ఈ సినిమాతోనైనా ఆనంద్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com