Home

»

Latest News

రజనీకాంత్‌తో ఫోన్ సంభాషణ లీకైంది!

Aug 01, 2020

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీయాలనేది చాలామంది దర్శకుల కల. కెరీర్‌లో ఒక్కసారైనా తలైవాకి  'స్టార్ట్... కెమెరా... యాక్షన్' చెప్పాలని అనుకుంటారు. అటువంటి కలలు కన్న ఓ యువ దర్శకుడిగా రజనీ నుండి పిలుపు వస్తే? తన కోసం ఓ కథ రాయమని రజనీ అడిగితే? ఆనందానికి అవధులు ఉంటాయా? అటువంటి ఆనందంలో తమిళ దర్శకుడు డేసింగ్ పెరియసామి ఉన్నాడు. దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమాతో సూపర్‌స్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందే అదృష్టం అతడిని వరించింది. 

'మహానటి' ఫేమ్ దుల్కర్ సల్మాన్, తెలుగమ్మాయి రీతూ వర్మ జంటగా నటించిన సినిమా 'కనులు కనులను దోచాయంటే'. దీనికి డేసింగ్ పెరియసామి దర్శకుడు. లాక్‌డౌన్‌కి ముందు విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమాను రజనీకాంత్ చూశారు. దర్శకుడికి ఫోన్ చేసి అభినందించారు. రజనీకాంత్ పేరు ప్రస్తావించకుండా ఓ పెద్ద హీరో నుండి ఫోన్ వచ్చిందనీ, ప్రశంసించారనీ సోషల్ మీడియాలో  డేసింగ్ పెరియసామి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. అయితే, రజనీతో అతడి ఫోన్ సంభాషణ లీకైంది. దాంతో అతడి సంతోషం ఆవిరైంది. అదీ సంగతి!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com