Home

»

Latest News

ప్రాణాపాయం నుంచి బయటపడిన షారుఖ్ ఖాన్

Nov 20, 2016 11:20AM

బాలీవుడ్ బాద్‌షా, కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం గౌరి షిండే దర్శకత్వంలో డియర్ జిందగీ అనే చిత్రంలో నటిస్తున్నారు. షారుఖ్ పక్కన అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రజంట్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. ఇవాళ్టీ షూటింగ్‌లో భాగంగా షారుఖ్, అలియాలు సైకిల్‌పై షాట్ చిత్రీకరించాల్సి ఉంది. దీనికి కావాల్సిన సామాగ్రిని ఓ టెంపోలో తీసుకువచ్చారు. టెంపో ఆగిన చోటే సైకిల్ పక్కన షారుఖ్ నిల్చున్నారు. అయితే టెంపో డ్రైవర్ ఆయన్ను గమనించకుండా వాహనాన్ని ముందుకు పోనించాడు. దీంతో టెంపో సైకిల్ మీద నుంచి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన షారుఖ్ రెప్పపాటులో పక్కకు తప్పుకోవడంతో..ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఆయన సురక్షితంగా బయటపడటంతో యూనిట్ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com