Home

»

Latest News

నాగార్జున "డమరుకం" జూన్ సెకండ్ వీక్ రిలీజ్

May 26, 2012

నాగార్జున "డమరుకం" జూన్ సెకండ్ వీక్ రిలీజ్ కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, కింగ్ నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం "డమరుకం". ఈ చిత్రం నాగార్జున సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా, తొలి సోషియో ఫాంటసీ చిత్రంగా కూడా చెప్పవచ్చు.

ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ "డమరుకం" చిత్రానికి ఇప్పటి వరకూ 50 కోట్ల రూపాయలు ఖర్చయిందని సమాచారం. ఈ "డమరుకం" చిత్రాన్ని జూన్ సెకండ్ వీక్ లో రిలీజ్ చెయ్యటానికి ఈ చిత్ర నిర్మాత డాక్టర్ వెంకట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ "డమరుకం" చిత్రం ఆడియోని త్వరలో విడుదల చేయనున్నారట.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com