దేవరలోని చుట్టమల్లే సాంగ్ కి సరైన గుర్తింపు రాలేదు
on May 17, 2025

ఎన్టీఆర్(Ntr),జాన్వీకపూర్(Janhvi Kapoor)కొరటాల శివ(Koratala Siva)కాంబోలో గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర(Devara). ఎన్టీఆర్ కెరిరీలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఈ చిత్రంలోని అన్ని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, జాన్వీకపూర్ మధ్య తెరకెక్కిన 'చుట్టమల్లే' సాంగ్ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో ఆ ఇద్దరు వేసిన స్టెప్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాయి. యూట్యూబ్ లో వీడియో సాంగ్ కి ఇప్పటి వరకు 126 మిలియన్ల వ్యూస్ దక్కాయంటే ఈ సాంగ్ సృష్ఠ్టిస్తున్న ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్(Bosco Martis)నేతృత్వంలో ఈ సాంగ్ తెరకెక్కడం జరిగింది.
రీసెంట్ గా బోస్కో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు చుట్టమల్లే సాంగ్ కి నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. మూవీ ప్రమోషన్స్ సమయంలో నా గురించి ఎవరైనా మాట్లాడతారేమో అనుకున్నాను. కానీ ఎవరు మాట్లాడలేదు. జాన్వీ కపూర్ అయినా మాట్లాడుతుందేమో అని అనుకున్నాను. ఏదైనా పాటలు పాపులర్ అయినప్పుడు కొరియోగ్రాఫర్ కి సరైన గుర్తింపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చాడు.
2000 వ సంవత్సరంలో సంజయ్ దత్, హృతిక్ రోషన్, జాకీష్రఫ్ హీరోలుగా తెరకెక్కిన 'మిషన్ కాశ్మీర్' తో బోస్కో సినీ రంగ ప్రవేశం జరిగింది. ఇప్పటి వరకు సుమారు డెబ్భై ఐదుకి పైగా చిత్రాల్లో రెండువందల పాటలకి దాకా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసాడు. అనేక అవార్డులు కూడా గెలుచుకున్న బోస్కో నుంచి రీసెంట్ గా బడే మియాన్ చోటా మియాన్, ఫైటర్, ఇండియన్ 2 ,బాడ్ న్యూస్ వంటి చిత్రాల్లోని పాటలు వచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



