Home

»

Latest News

రేవంత్ రెడ్డి ని కలిసిన బాలకృష్ణ కూతురు తేజస్విని 

Sep 13, 2024 4:30PM

వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ(balakrishna)ఇరు రాష్ట్రాలకి చెరో యాభై లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట మేరకు రీసెంట్ గా  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందివ్వడం జరిగింది.

సహా నటులు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ తో  కలిసి చంద్రబాబు నాయుడు ని కలిసిన బాలకృష్ణ తన చేతుల మీద చంద్రబాబు కి  యాభై లక్షల  చెక్కుని ఇచ్చాడు. ఇప్పుడు బాలకృష్ణ తరుపున ఆయన చిన్న కూతురు తేజస్విని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని చివాలయంలో కలిసి యాభై లక్షల రూపాయల చెక్కుని అందివ్వడం జరిగింది.  ఈ సందర్భంగా తేజస్విని(tejaswini)ముఖ్యమంత్రి అభినందించడం తో పాటు  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, క్రీడల సలహాదారు  జితేందర్ రెడ్డి ని తేజస్వినికి పరిచయం చేసారు.

తేజస్విని గత కొంత కాలం నుంచి తండ్రి బాలకృష్ణ సినీ వ్యవహారాల మొత్తాన్ని చూసుకుంటుంది. బాలకృష్ణ కి  ఎవరైనా కథ చెప్పాలంటే ముందుగా తేజస్విని నే కలవాలి. ఇక రీసెంట్ గా ఆమె సోదరుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన ఫస్ట్ మూవీకి  తేజస్విని నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com