Home

»

Latest News

నందమూరి బాలకృష్ణ సరసన సలోని

Mar 07, 2011

balakrishna saloni,nandamuri balakrishna saloni, saloni balakrishna, yuvaratna balakrishna saloni, balayya saloni, ప్రముఖ హీరోయిన్ సలోని ఆ మధ్య రాజమౌళి దర్శకత్వంలో, సునీల్ హీరోగా నటించిన "మర్యాదరామన్న" చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ సలోనీకి ఆ తర్వాత రావలసినంత గుర్తింపు రాలేదు, అలాగే రావలసినన్ని సినిమాలు రాలేదు. అని సలోనీ బాధపడుతూండగా తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా, ఊహించని చక్కని అవకాశం సలోనీకి దక్కింది. అదేంటంటే సలోనీకి ఏకంగా యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది.

 

నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్ యల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలో సలోనీకి హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఇందులో సలోనీ పాత్ర మాంచి కిక్కిచ్చేటువంటి మాస్ మసాలాతో ఉండేలాంటి పాత్ర లభించిందట. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన నటించే పాత్ర తనకు మంచి పేరు తెస్తుందని సలోనీ భావిస్తూంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com