కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయారు
on Nov 6, 2024

రజనీకాంత్(rajinikanth)హీరోగా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ వేట్టయన్(vettaiyan)సూర్య(suriya)తో జై భీం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన టిజె జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించగా,లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. అమితాబ్, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, దుషారా విజయన్,రానా దగ్గుపాటి ముఖ్యపాత్రల్లో చేసారు.
వేట్టయన్ పోస్టర్స్ చాలా వినూత్నంగా డిజైన్ చెయ్యబడి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ప్రెజంట్ వరుణ్ ధావన్(varun davan)హీరోగా బాలీవుడ్ లో 'బేబీ జాన్(baby john)'అనే సినిమా తెరకెక్కుతుంది.రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సేమ్ వేట్టయన్ పోస్టర్స్ లాగానే డిజైన్ చేసారు. పైగానటినటుల్ని పోస్టర్ లో పొందు పరచడం కూడా సేమ్ వేట్టయన్ లాగానే చేసారు.దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ కూడా కాపీ అయితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్(vijay)హీరోగా అట్లీ దర్శకతంలో వచ్చిన తేరి కి రీమేక్ గా తెరకెక్కుతున్న బేబీ జాన్ కి కలిస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు.డిసెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



