నీకు పుణ్యం ఉంటుంది బాబు.. ఆ పని చేసి పెడతావా
on Jan 21, 2026

-జోరందుకున్న రిక్వెస్ట్ లు
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-అనిల్ రావిపూడి నిర్ణయం ఏంటి!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పొగడ్త కొంచం అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ సినీ జగత్తు లో ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు మాత్రమే పొగడ్తలనేవి పరిగణలోకి వస్తుంటాయి. ఆ లెక్కన ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే తెలుగు సినిమా..తెలుగు సినిమా అంటే అనిల్ రావిపూడి(Anil Ravipudi)అనే పరిస్థితి. అలనాటి తెలుగు సినిమా వైభవాన్ని అచ్చ తెలుగు పండగైన సంక్రాంతి కి సిల్వర్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ఉంచడమే ప్రధాన కారణం. పైగా ఈ మాటలన్నీ పని గట్టుకొని మరి మేము చెప్పడం లేదు. అభిమానులు, మూవీ లవర్స్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. ఈ క్రమంలోనే అగ్ర హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి ని రిక్వెస్ట్ చేస్తు పోస్ట్ లు చేస్తున్నారు. ఆ పోస్టుల వెనక ఉన్న మ్యాటర్ ఏంటో చూద్దాం.
అగ్ర హీరో ఇమేజ్ కి ఏ మాత్రం డ్యామేజ్ కలగకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సబ్జెట్స్ కి, ఓవర్ డోస్ లేని సెంటిమెంట్ ని జోడించి సినిమా రూపొందించడం అనిల్ రావిపూడి స్టైల్. ఒకరకంగా అచ్చ తెలుగు సినిమా సూత్రం కూడా అదే. అందుకే ఆ స్టైల్ ఆఫ్ జోనర్ లో మా అభిమాన హీరో సినిమా చేస్తే చూడాలనే కోరిక ఉంది. పైగా సంక్రాంతికే బాక్స్ ఆఫీస్ పై ప్రత్యక్షమవుతుండటంతో పాజిటివ్ టాక్ సంపాదిస్తే చాలు ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలు సైతం జూలు విదిల్చిన మూవీ లవర్స్ లా ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు వేసుకొని మరి థియేటర్స్ కి వెళ్తున్నారు. ఆ విధంగా మా హీరో సినిమాకి వెళ్తుంటే ఎంతగా ఆనంద పడతామో మీకు తెలియంది కాదు.. మా హీరోలు పాన్ ఇండియా సినిమా ఇవ్వాలని పాన్ ఇండియా సబ్జెట్స్ తెరకెక్కించే పనిలో చాలా టైం తీసుకుంటున్నారు.
also read: ప వన్ కళ్యాణ్ ప్రధానమంత్రి!..ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్
కాబట్టి అనిల్ రావిపూడి గారు మా హీరోలని సంప్రదించి మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా నెక్స్ట్ సంక్రాంతికి మా హీరోతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వండి అని అనిల్ రావిపూడి ని రిక్వెస్ట్ చేస్తున్నారు.ఆ రిక్వెస్ట్ లు పాన్ ఇండియా ఇమేజ్ ని పొందిన అందరి బడా హీరోలవి. మరి నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి ఎవరితో వస్తాడో, ఆ అదృష్ట అభిమానులు ఎవరో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



