ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం
on Jan 15, 2026

-మొదటి రోజు కలెక్షన్స్ ఎంత!
-నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి మెప్పించారా!
-ప్రేక్షకులు ఏమంటున్నారు
సంక్రాంతికి వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.
ఫస్ట్ డే తమ చిత్రం వరల్డ్ వైడ్ గా 22 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించట్టుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. నవీన్ పొలిశెట్టి కెరీర్ లోనే హయ్యస్ట్ ఫిగర్ ఇదే. పైగా చిరంజీవి, వెంకటేష్,రవి తేజ వంటి స్టార్స్ సినిమాలకి కూడా పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో 22 కోట్లు సాధించడమంటే అనగనగ ఒక రాజు పై మూవీ లవర్స్, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కి నిదర్శనంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
also read: Narinarinadumamurari: నారీనారీనడుమ మురారి మూవీ రివ్యూ
మూవీ చూసిన ప్రేక్షకులు మాట్లాడుతు రాజు, చారులత క్యారెక్టర్స్ లో నవీన్, మీనాక్షి అద్భుతంగా చేసారని, మిగతా నటీనటులు కూడా తమ పెర్ ఫార్మెన్స్ తో మెప్పించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటం అనగనగ ఒక రాజు కి కలిసొచ్చే అంశం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



