ది రాజాసాబ్ రిజల్ట్ పై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే
on Jan 10, 2026

-రాజా సాబ్ ఫలితం ఏంటి
-అల్లు అర్జున్ చెప్పిన మాటలు వైరల్
-పది రోజుల్లో ఏం జరగబోతుంది
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas),ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun).. పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరి మధ్య సుదీర్ఘ కాలం నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు అభినందనలు తెలుపుకుంటూ ఉంటారు. ఈ కోవలోనే ప్రభాస్ కొత్త మూవీ రాజా సాబ్ గురించి అల్లు అర్జున్ ఏం చెప్పాడో చూద్దాం.
రాజా సాబ్ చిత్ర బృందం రీసెంట్ గా హైదరాబాద్ వేదికగా తమ చిత్రం యొక్క విజయోత్సవ సభ ని నిర్వహించింది. సదరు సభ లో రాజా సాబ్ దర్శకుడు మారుతి(Maruthi)మాట్లాడుతు 'రాజాసాబ్ బాగుందని, ప్రభాస్ ని కొత్తగా చూపించావని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు,. బన్నీ(అల్లు అర్జున్) బాబు కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు.రాజా సాబ్ విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కొత్త కంటెంట్ ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పది రోజుల్లో అసలు టాక్ బయటకి వస్తుంది. ప్రభాస్ అభిమానులు కూడా మా హీరో సినిమాకి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం కామన్ అని చెప్పారని మారుతి వెల్లడి చేసాడు.
Also read: ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు
ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారడంతో ప్రభాస్, అల్లుఅర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మారుతి, అల్లు అర్జున్ సుదీర్ఘ కాలం నుంచి మంచి స్నేహితులు. మారుతి సినీ ఎదుగుదలలో అల్లు అర్జున్ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్నీ మారుతి నే చాలా సార్లు చెప్పాడు. రాజాసాబ్ పూర్తి స్క్రిప్ట్ గురించి అల్లు అర్జున్ కి తెలుసు అనే వ్యాఖ్యలని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



